సైబరాబాద్ లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో భాగంగా 320 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. ఇందులో 265 ద్విచక్ర వాహనదారులు, 16 ఆటోలు, 38 కార్లు, 1 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు.
దిల్‌సుఖ్‌నగర్: ఆర్‌కేపురంలోని కుర్తాళం పీఠం శ్రీ వారాహి దశమహావిద్య పరివార సమేత శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి ఆలయాన్ని ఆదివారం నగర సీపీ సజ్జనర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సెక్రటరీ మునిపల్లె శ్రీనివాస్, సువర్ణలత దంపతులు సీపీకి జ్ఞాపికను అందచేసి సన్మానించారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో నిత్యం కుంకుమార్చన, పారాయణాలు, హారతుల సేవలు జరుగుతున్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు.


