షాబాద్: కుటుంబపరమైన సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ డీకే లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామానికి చెందిన గడ్డంగుల ముర్గేశ్ (32) షాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబపరమైన సమస్యల కారణంగా ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వైద్య విద్యార్థినిని మోసగించిన నిందితుడికి రిమాండ్
ఫిలింనగర్: వైద్య విద్యార్థినిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి ముఖం చాటేసిన నిందితుడు గత మూడు నెలలుగా పరారీలో ఉండగా ఫిలింనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. కొంపల్లి దేవరయాంజల్‌లో నివసించే జోగు హరిబాబు (27) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితం కామన్ ఫ్రెండ్ ద్వారా ఒంగోలులో ఎంబీబీఎస్ చదువుతున్న మెడికోతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గత జులైలో ఆమె పెళ్లి మాట ఎత్తేసరికి నిందితుడు గది ఖాళీ చేసి పరారయ్యాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధిత మెడికో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిఘా పెట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చాదర్‌ఘాట్: సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపిన మేరకు.. పల్టన్‌కు చెందిన విద్యార్థి పవన్ (20) స్నేహితుడితో కలిసి శనివారం అర్ధరాత్రి తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. సైదాబాద్ స్టీల్‌బ్రిడ్జ్ ప్రారంభం వద్ద వేగంగా వెళ్తూ టిప్పర్ లారీ సమీపంలో కట్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మరో వాహనాన్ని ఢీకొట్టి ఇద్దరూ కిందపడిపోయారు.తీవ్ర గాయాలతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన మరో యువకుడిని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


