బెడ్స్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

బెడ్స్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Oct 21 2026 8:08 AM | Updated on Oct 21 2026 8:08 AM

షాద్‌నగర్‌: షార్ట్‌సర్క్యూట్‌తో అర్ధరాత్రి పరిశ్రమలో మంటలు చెలగేరి భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటన నందిగామ మండలం మేకగూడ శివారులో చోటు చేసుకుంది. వివరాలివీ.. శ్రీనాథ్‌ స్లీప్‌ ప్రొడక్ట్స్‌ పరిశ్రమలో బెడ్స్‌ తయారు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి పరిశ్రమలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో ఉన్న బెడ్స్‌తో పాటు యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న షాద్‌నగర్‌, మహేశ్వరం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్‌ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని ఐదుగంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ సుశీల సహాయక చర్యలు చేపట్టారు. రూ.కోట్లలో నష్టం జరిగిందని పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement