నిమజ్జనాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనాల పరిశీలన

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

చేవెళ్ల: స్థానిక పుష్కరణి వద్ద నిమజ్జనాన్ని శుక్రవారం అర్ధరాత్రి ఫ్యూచర్‌ సిటీ సీపీ తరుణ్‌ జోషి డీసీపీ యోగేశ్‌గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ బి. యాదగిరి, చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి, ఏసీపీ కిషన్‌, స్థానిక నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను వారు సీపీకి వివరించారు. అనంతరం నిమజ్జనంలో కష్టపడి పనిచేసిన మున్సిపల్‌ సిబ్బందిని సీపీ శాలువాలతో సన్మానించారు. ఆయన వెంట సీఐ కట్ట నరేందర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ సతీష్‌, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు శైలజఆగిరెడ్డి, ఎం.శ్రీనివాస్‌, బీజేపీ మున్సిపల్‌ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

శేరిగూడ చెక్‌ డ్యాం వద్ద..

ఇబ్రహీంపట్నం: శేరిగూడ చెక్‌ డ్యాం వద్ద జరుగుతున్న నిమజ్జన ప్రక్రియను శనివారం తెల్లవారుజామున ఫ్యూచర్‌ సిటీ సీపీ తరుణ్‌జోషి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తించిన సిబ్బంది, అధికారులను ప్రశంసించారు. ఆయన వెంట ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement