వంటింట్లోకే గ్యాస్‌! | - | Sakshi
Sakshi News home page

వంటింట్లోకే గ్యాస్‌!

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

ఎంతో సురక్షితం.. అధిక లాభం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రతి వంటింటికీ పైప్‌లైన్‌న్‌ద్వారా సహజ వాయువు (పీఎన్జీ), వాహనాలకు కంప్రేసెడ్‌ గ్యాస్‌ (సీఎన్జీ) అందించే పనులు జిల్లాలో వడివడిగా సాగుతున్నాయి. షాద్‌నగర్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి, మహేశ్వరం, కొత్తూరు ప్రాంతాల్లో మెగా గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌ సంస్థ పైప్‌లైన్‌ విస్తరణ పనులు చేపడుతుండగా, ఔటర్‌ లోపల భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (బీజీఎల్‌) సంస్థ విస్తరణ పనులు చేపట్టింది. గచ్చిబౌలి నుంచి అత్తాపూర్‌–కాటేదాన్‌న్‌మీదుగా ఎల్‌బీనగర్‌ వరకు (సుమారు 37 కిలో మీటర్లు) చేపట్టిన పైప్‌లైన్‌న్‌పనులు పూర్తి కావచ్చాయి. తూర్పుతీర ప్రాంతంలోని కృష్ణా–గోదావరి బేసినన్‌్‌లో ఆపారమైన సహజవాయవు నిల్వలున్నప్పటికీ పైప్‌లైన్ల విస్తరణకు అనుమతులు లభించక పుష్కరకాలం పైగా ఆపసోపాలు పడుతున్న ఆయా సంస్థలు తాజాగా అన్నింటినీ అధిగమించి పైప్‌లైన్‌న్‌విస్తరణ పనుల వేగవంతానికి ఉపక్రమించాయి. గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (గెయిల్‌) హెచ్‌పీసీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకొని సహజవాయివును పైప్‌లైనన్‌్‌ ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. త్వరలోనే జిల్లాలోని అన్ని ఇళ్లకు పైపులైన్‌ ద్వారా వంటగ్యాస్‌ సరఫరా కాబోతోంది. నెలవారీ రీఫిల్‌ బుకింగ్‌, గ్యాస్‌ బండలను మోసే భారం తప్పనుంది. ప్రస్తుత ఎల్‌పీజీ గ్యాస్‌ ధరతో పోలిస్తే డీపీఎన్‌జీ ధరలు చాలా తక్కువ ఉండటంతో గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాల్లోని మెజార్టీ వినియోగదారులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు.

ఓఆర్‌ఆర్‌ బయట

ఇప్పటి వరకు ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న సేవలను శివారు పట్టణాలు, మారుమూల గ్రామాలకు విస్తరింపజేయాలని కేంద్రం భావించింది. ఈ మేరకు ప్రైవేటు గ్యాస్‌ లిమిటెడ్‌ కంపెనీలకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న పలు ప్రాంతాల్లో భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ (బీజీఎల్‌)ప్రాజెక్టు పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేస్తోంది. ఓఆర్‌ఆర్‌ బయట ఉన్న షాద్‌నగర్‌, కొత్తూరు, మహేశ్వరం, చేవెళ్ల, శంకర్‌పల్లి, మోకిల తదితర ప్రాంతాల్లో మెగా గ్యాస్‌ ఏజెన్సీ పనులు మొదలు పెట్టింది. ఇప్పటికే జిల్లాలో 135 కిలోమీటర్ల 12 ఇంచుల పైప్‌లైన్‌ పనులు పూర్తి చేసింది. శంకర్‌పల్లి, మోకిలలో 60 కిలోమీటర్లు, షాద్‌నగర్‌లో 8 కిలోమీటర్ల మేర లైను వేసింది. శంకర్‌పల్లి మండలంలో 12,000 కనెక్షన్లు టార్గెట్‌గా పెట్టుకుని ఇప్పటికే 2,500 ఇచ్చింది. షాద్‌నగర్‌లో 5000 కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుని, 35 ఇచ్చింది. క్షేత్రస్థాయిలోని కొంత మంది గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లు ఈ డొమెస్టిక్‌ పైప్‌ నేచురల్‌ గ్యాస్‌ (డీపీఎన్జీ) పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. స్థానికంగా తమ ఉనికి దెబ్బతింటుందనే భయంతో విస్తరణ పనులకు అడ్డు తగులుతున్నారు. సేవలు, గ్యాస్‌ ధరలు, భద్రత ప్రమాణాల విషయంలో వినియోగదారులకు లేని భయాన్ని సృష్టించి, పరోక్షంగా పనులకు అడ్డుతగులుతున్నారు. నిజానికి ఎల్‌పీజీ సిలిండర్‌తో పోలిస్తే డొమెస్టిక్‌ పైప్‌ నేచురల్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ఎంతో సురక్షితం. అవగాహన లేక మెజార్టీ వినియోగదారులు కనెక్షన్‌కు వెనుకాడుతున్నారు. కంపెనీ ప్రతినిధులు ఆయా వినియోగదారులకు అవగాహన కల్పించి, నచ్చజెప్పి లైన్లు వేయాల్సి వస్తోంది.

ఓఆర్‌ఆర్‌ లోపల బీజీఎల్‌

గచ్చిబౌలి నుంచి అత్తాపూర్‌–కాటేదాన్‌న్‌మీదుగా ఎల్‌బీనగర్‌ వరకు సుమారు 37 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్‌న్‌పనులు విస్తరించాలని బీజీఎల్‌ నిర్ణయించింది. ఆ మార్గంలో సుమారు రెండు లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వొచ్చని భావిస్తోంది. వాస్తవంగా పుష్కర కాలం క్రితం బీజీఎల్‌ సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌న్‌ప్రాజెక్టుకు హైదరాబాద్‌లో శ్రీకారం చుట్టింది. అప్పట్లో తొలి ఐదేళ్ల కోసం రూపొందించిన పీఎన్జీ, సీఎన్జీ విస్తరణ ప్రణాళిక పూర్తికి వివిధ అడ్డంకుల కారణంగా 15 ఏళ్లు పట్టింది. శామిర్‌పేట మదర్‌స్టేషన్‌న్‌కేంద్రంగా ప్రాజెక్టు ఏర్పాటు చేసి తొలుత సమీపంలోని నల్సార్‌ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని గృహ సముదాయాలకు పైప్‌లైన్‌న్‌ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు అందించింది. తర్వాత మేడ్చల్‌, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, మణికొండ, గచ్బిబౌలి తదితర ప్రాంతాలకు విస్తరించింది. తాజాగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని పలు గేటెడ్‌ కమ్యూనిటీలకు సైతం పైప్‌లైన్ల ద్వారా వంట గ్యాస్‌ అందిస్తోంది. తాజాగా మరో రెండు మదర్‌ స్టేషన్ల ఏర్పాటుకు సిద్ధం కాగా, ఇప్పటికే హఫీజ్‌పేటలో మదర్‌ స్టేషన్‌ ప్రారంభించి రోజుకు సగటున 45,000 కిలోలు గ్యాస్‌ సరఫరా చేస్తోంది. మరోవైపు మహానగరం పూర్తి స్థాయిలో సీఎన్జీ ప్రక్రియకు సిద్ధమైంది. మేడ్చల్‌, హకీంపేట, కంటోన్మెంట్‌, బాలానగర్‌ తదితర ప్రాంతాల్లో సీఎన్జీ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసింది. ప్రైవేటు వాహనాల కోసం నగరంలో సుమారు 90 సీఎన్జీ స్టేషన్లు ఉండగా, మరో ఐదు నుంచి పది వరకు కొత్తగా ఏర్పాటు చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది.

సిలిండర్‌ అవసరం లేదు.. రీఫిల్‌తో పని లేదు

ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డీపీఎన్‌జీ లైన్లు

జిల్లాలో వడివడిగా సాగుతున్న పనులు

ఇప్పటికే 135 కిలోమీటర్ల లైన్‌ పూర్తి

కొత్తూరు తండా, షాద్‌నగర్‌, శంకర్‌పల్లి, మోకిల, మహేశ్వరంలో కనెక్షన్ల జారీ

నేరుగా సరఫరాకు చర్యలు

వాటర్‌ పైప్‌లైన్‌ తరహాలో లైన్‌ వేస్తాం. భూమిలోపల మీటర్‌ లోతులో 63 ఎంఎం, 32 ఎంఎం సైజు స్టీల్‌/ ఐరెన్‌ కొటెడ్‌ జీఐ పైపులు వేస్తారు. లైన్‌లోని ప్రతి 50 మీటర్లకు ఒక రూట్‌ మార్కర్‌ ఉంటుంది. ఎల్లో కలర్‌లో ఉండే సర్వీసు రెగ్యులేటర్‌ ఉంటుంది. ఇది సరఫరా, లీకేజీలను నియంత్రిస్తుంది. గ్యాస్‌ వినియోగాన్ని లెక్కించేందుకు మీటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది ఎన్ని యూనిట్లు వాడామో లెక్కిస్తుంది. 24 గంటలు సరఫరా ఉటుంది. మొబైల్‌ ఫోన్‌కు లింకై ఉంటుంది. గ్యాస్‌ నిల్వలపై ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తుంది. కూర్చొన్న చోట నుంచే రీచార్జీ చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.300 నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే ఫాల్ట్‌ రెక్టిఫికేషన్‌, ఎమర్జెన్సీ రెక్టిఫికేషన్‌ బృందాలు అలెర్ట్‌ అవుతాయి. పైపు లైన్‌ ద్వారా నేరుగా గ్యాస్‌స్టవ్‌ వరకు లైన్‌ వేస్తారు.

– వరప్రసాద్‌, అసోసియేట్‌ మేనేజర్‌, మెగా గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement