ఆసియా క్రీడల్లో తరుణ్‌ ప్రతిభ భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడల్లో తరుణ్‌ ప్రతిభ భేష్‌

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

ఆసియా క్రీడల్లో తరుణ్‌ ప్రతిభ భేష్‌

హుడాకాంప్లెక్స్‌: ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ విభాగంలో క్యాంస్య పతకం సాధించిన మన్నేపల్లి తరుణ్‌ను, ఆయన మాజీ కోచ్‌ ఎంవీ ఫణికిషోర్‌ను జిల్లా యువజన క్రీడల అధికారి స్వర్ణలత శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ ఘనత రాష్ట్రానికి, జిల్లాకు, క్రీడా రంగానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. తరుణ్‌ క్రీడా ప్రస్థానంలో ఆయన మాజీ కోచ్‌ ఎంవీ ఫణికిషోర్‌ అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడాకారుడి విజయానికి కోచ్‌ల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిరంతర సాధన ఎంతో కీలకమని తెలిపారు. ప్రస్తుతం పద్మభూషణ్‌ పుల్లెల గోపీచంద్‌ మార్గదర్శకత్వంలో హైదరాబాద్‌లోని బ్యాడ్మింటన్‌ అకాడమీలో తరుణ్‌ శిక్షణ పొందుతున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన విజయానికి సహకరించిన కోచ్‌లు, కుటుంబసభ్యులు, క్రీడాభిమానులకు తరుణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా సంస్థకు చెందిన కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement