కలెక్టరేట్ వరకు పాదయాత్ర
మహేశ్వరం: మండల పరిధిలో గుంతలమైన రోడ్లను ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో మహేశ్వరం–కలెక్టరేట్ వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు, తండాల్లో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంన ఉంచి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. హ్యామ్ కింద మంజూరైన 12 రోడ్ల నిర్మాణాలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో ప్రారంభమైన పాదయాత్ర మహేశ్వరం గేటు, శ్రీశైలం జాతీయ రహదారి, శ్రీనగర్, తుక్కుగూడ, రావిర్యాల మీదుగా కొంగర కలాన్ కలెక్టరేట్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, బీజేపీ జాతీయ కిసాన్‌మోర్చా నాయకులు పాపయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, కొప్పు బాషా, సుదర్శన్‌రెడ్డి, అనంతయ్య గౌడ్, చంద్రయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు దేశ్యా నాయక్, యాదయ్య గౌడ్, వెంకటేష్, సుదర్శన్, పాండు నాయక్, మండల బీజేపీ అధ్యక్షుడు యాదీశ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


