విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

కొడంగల్‌: విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రివల్యూషనరీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ) జాతీయ అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని, నిరుద్యోగులకు ప్రతీ నెల రూ.4వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వడ్డె భీమ్‌రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్‌, వెంకటేశ్‌, మహ్మ ద్‌ ఫయాజ్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement