మొయినాబాద్: సాధారణంగా ఏ వస్తువైనా పాడైతే మరమ్మతులు చేయించి మళ్లీ ఉపయోగిస్తారు. మున్సిపల్ అధికారులు మాత్రం స్క్రాప్‌లో పడేస్తారు. మొయినాబాద్ మున్సిపాలిటీలోని పెద్దమంగళారంలో గతంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు కొంత కాలం క్రితం పాడయ్యాయి. వాటికి మరమ్మతులు చేయించి తిరిగి వాడుకునే అవకాశం ఉన్నా అధికారులు అలా చేయలేదు. వాటిని విద్యుత్ స్తంభాల నుంచి పూర్తిగా తొలగించి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న ఓ భవనంలో స్క్రాప్ కింద పడేశారు. సుమారు వందకుపైగా లైట్లను ఇలా పడేయడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


