● మరో స్టూడెంట్ పరిస్థితి విషమం
● మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గురునానక్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు డిన్నర్ పూర్తి చేసుకొని జేబీవెంచర్ వైపు వాకింగ్ చేస్తుండగా, మాల్ నుంచి వేగంగా వచ్చిన టాటా మినీ వ్యాన్ వీరిని ఢీకొడుతూ వెళ్లి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన బీటెక్ ఫస్టియర్ విద్యార్థి హర్షవర్ధన్(19) అక్కడికక్కడే మృతిచెందాగా వరంగల్‌కు చెందిన మరో విద్యార్థి శివరాజ్ పరిస్థితి విషమంగా ఉంది. వీరితోపాటు కౌమిద్‌రెడ్డి, అక్షమ్, కార్తిక్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు.


