న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అభివృద్ధిలోనే కాదు అవినీతిలోనూ జిల్లా అధికారులు ముందు వరుసలో ఉన్నారు. సీనియార్టీ, సిన్సియార్టీతో సంబంధం లేకుండా అడ్డదారుల్లో పోస్టింగ్‌లు సంపాదిస్తున్న కొంత మంది అధికారులు తర్వాత అక్రమార్జనకు అలవాటుపడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నారు. కొంత మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతుండగా, మరికొంత మంది ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై జైలుకు వెళ్తున్నారు.
జిల్లాలో కొన్ని ఉదంతాలు..
● అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి సహా సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి 14 గుంటల భూమికి పాసుపుస్తకం జారీకి గుర్రంగూడకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ 2024 ఆగస్టు 12న ఏసీబీకి చిక్కారు.
● పాసుబుక్‌లో జెండర్ సవరణకు డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఆమనగల్లు తహసీల్దార్ లలిత సహా సర్వేయర్ రవిపై కేసు నమోదైంది.
● తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున, వీఆర్‌ఏ యాదగిరి భూమి పేరు మార్పిడి విషయంలో రూ.50 వేలు లంచంగా తీసుకుంటూ చిక్కారు.
● రెవెన్యూ రికార్డులో పేరు మార్పిడీ కోసం రూ.9 లక్షలు లంచంగా తీసుకుంటూ కేశంపేట గత తహసీల్దార్ లావణ్య సహా వీఆర్‌ఓ అనంతయ్య పట్టుబడ్డారు.
● ఓ ఇంటి స్థలం వాల్యూయేషన్, నోడ్యూస్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటూ మే 5న తలకొండపల్లి మండలం వెల్జాల కార్యదర్శి శరత్‌కుమార్ పట్టుబడ్డారు.
● ఆదిభట్లలోని ఏడు గుంటల భూమికి పాసుపుస్తకం జారీ కోసం రూ.12 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీసులోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జి.కృష్ణ అరెస్ట్ అయ్యారు.
● ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై సర్వే లాండ్స్ అధికారి శ్రీనివాసులుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈయన ఏకంగా రూ.వంద కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చింది.
● తుర్కయంజాల్ పరిధిలో 200 గజాల గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.70 వేలు లంచంగా తీసుకుంటూ వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కారు.
● ఓ ప్రైవేటు సీబీఎస్‌ఈ స్కూలుకు ఎన్‌ఓసీ జారీ విషయంలో డీఈఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ జి.శ్రీధర్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఫిబ్రవరి 15న ఏసీబీకి చిక్కారు.
● విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభుదాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గత ఏడాది ఏసీబీకి చిక్కారు.
● మీర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఓ బాధితుడి నుంచి వైన్ బాటిళ్లు డిమాండ్ చేసిన కేసులో ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
● బడంగ్‌పేటలో ఏకంగా కమిషనర్ సహా పది మంది ఉద్యోగులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ వేటు వేశారు.
● ఇక బఫర్‌జోన్లలో నిర్మాణాలకు ఎన్‌ఓసీ జారీకి రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో జిల్లా నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ సహా ఏఈ కె.కార్తీక్, ఎస్‌ఈ ఆఫీసులోని ఏడబ్ల్యూ సెక్షన్ ఏఈ హెచ్.నిఖేష్‌కుమార్, గండిపేట మండల సర్వేయర్ పి.గణేశ్ ఏసీబీకి చిక్కారు.
అవినీతి జలగలు
ప్రభుత్వ ఆఫీసుల్లో తిష్టవేసిన అక్రమార్కులు
అక్రమ వసూళ్లు.. ఆదాయానికి మించి ఆస్తులు
తరచూ ఏసీబీకి పట్టుబడుతున్న అధికారులు
అయినా మారని తీరు
తాజాగా ఇబ్రహీంపట్నం డీఏఓ శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు


