బ్రహ్మంగారిమఠంలో జిల్లావాసి మృతి | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మంగారిమఠంలో జిల్లావాసి మృతి

Aug 11 2026 7:15 AM | Updated on Aug 11 2026 7:15 AM

బ్రహ్మంగారిమఠం : వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఉట్లపల్లి విల్లగె వాసి మృతి చెందాడు. గ్రామానికి చెందిన అనంతయ్య కుమారుడు చిన్న శ్రీనివాస్‌ (50) కొంతకాలంగా అక్కడే ఉంటూ తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. సోమవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఆధార్‌ కార్డు ఆధారంగా వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

అదుపుతప్పి లారీ బోల్తా

కొడంగల్‌ రూరల్‌: మండల పరిధిలోని ఉడిమేశ్వరం గేటు సమీపంలో ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన సోమవారం చోటుచేసుకొంది. వివరాలు.. తాండూరు– మహబూబ్‌నగర్‌ హైవే పనులు కొనసాగుతుండగా, తాండూరు నుంచి కొడంగల్‌ వైపు సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ ఉడిమేశ్వరం సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తాపడింది. గమనించిన పరిసరవాసులు డ్రైవర్‌, క్లీనర్‌ను లారీ క్యాబిన్‌ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్‌ఐ యాదయ్య తెలిపారు.

ఇరువర్గాల ఘర్షణ

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని ఇంద్రానగర్‌ కాలనీలో ఇరువర్గాలు గొడవ పడగా, పలువురిపై కేసు నమోదైనట్లు సీఐ రఘుకుమార్‌ తెలిపారు. శనివారం రాత్రి బోనాల పండుగలో గొడవ జరుగుతోందనే సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి, ఇరువర్గాలను చెదరగొట్టామన్నారు. ఇందుకు కారణమైన పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement