అనంతగిరి: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ హరిప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి రెండు గంటలకు టాటానగర్ యశ్వంతపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌కు గుర్తుతెలియని మహిళ మృతదేహం చిక్కుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించాడు. ఈ విషయాన్ని వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి వయ స్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని, చామనఛాయ కలిగి ఉందని, తలపై నలుపు మరియు తెలుపు రంగు జుట్టు పురుషుల మాదిరిగా కత్తిరించి ఉందని తెలిపారు. బాడీని వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని, ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.


