హయత్‌నగర్: దేశంలో అటవీ సంపదను కాపాడుతూ, సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నది ఆదివాసీలే అని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం అబ్దుల్లాపూర్‌మెట్టు మండల గిరిజన సమాఖ్య కార్యదర్శి శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారని, కనీసం బడి మొకం చూడని తండాలు, గూడేలు ఉండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. రాజ్యాంగ బద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలు, సౌకర్యాలు అందించాలని, పల్లెల్లో విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సమాఖ్య అధ్యక్షుడు బానావత్ భిక్షం నాయక్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, ఆజ్మీరా హరిసింగ్ నాయక్, కేతరాజు నర్సింహ, సరిలాల్, లచ్చూనాయక్ తదితరులు పాల్గొన్నారు.


