చేవెళ్ల: పట్టణ కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలికల వసతిగృహానికి నూతన భవనం నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నాయకులు వసతిగృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వార్డెన్‌తో మాట్లాడి వసతిగృహంలోని సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తల్లిదండ్రులను వదిలి చదువుకోవడానికి హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల నుంచి హాస్టళ్లకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, అవి ఏ స్థాయిలో అమలవుతున్నాయో అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల బీసీ హాస్టల్‌లో రాత్రి భోజనంలో పురుగులు వచ్చిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హాస్టళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్‌కుమార్


