ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

Aug 9 2026 8:47 AM | Updated on Aug 9 2026 8:47 AM

మహేశ్వరం: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం జిల్లా కార్యదర్శి మునావత్‌ దేవేందర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ఆగస్టు 15 లోపు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శివ, రాహుల్‌, అభిలాష్‌, కె.సాయి, శారద వొకేషనల్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

బీజేవైఎం జిల్లా కార్యదర్శి దేవేందర్‌ నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement