షాద్‌నగర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు విధిగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలని హెచ్‌ఐవీ, ఎయిడ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి అన్నారు. షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ పనితీరును, ల్యాబ్‌లో గర్భిణులు, సాధారణ రోగులకు నిర్వహిస్తున్న హెచ్‌ఐవీ పరీక్షలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు తప్పనిసరి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌గా తేలితే వారి వివరాలను గోప్యంగా ఉంచి సంబంధింత రోగికి మాత్రమే సమాచారం అందించాలని సూచించారు. సకాలంలో చికిత్స అందిస్తే తల్లి, శిశువు, ఆరోగ్యంగా ఉంటారన్నారు. గ్రామాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, జిల్లా హెచ్‌ఐవీ ప్రోగ్రాం మేనేజర్ నరేందర్, సూపర్‌వైజర్ రమేష్, ఐసీటీసీ కౌన్సిలర్ శ్యాం తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ కంట్రోల్ జేడీ డాక్టర్ జయలక్ష్మి


