యాచారం: మండల పరిధిలోని ధర్మన్నగూడలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉప సర్పంచ్ నాగరాజు గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన బండ చెన్నయ్య, శ్రీశైలం, శ్రీనివాస్‌లు పనులను అడ్డుకుని ఉప సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం మేరకు యాచారం పోలీసులు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. దాడిపై ఉప సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


