11 నెలలు..8 విడతలు | - | Sakshi
Sakshi News home page

11 నెలలు..8 విడతలు

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా ఒకటి రెండుసార్లు సైబ ర్‌నేరాల బారినపడితేనే అప్రమత్తం అవుతారు. అదీ ఒకేరకమైన వేదికల కేంద్రంగా జరిగితే వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. షేక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగి (48) మాత్రం 11 నెలల కాలంలో ఎనిమిది విడతల్లో రూ.5.1 లక్షలు మోస పోయాడు. ప్రతి సందర్భంలో సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌ బుక్‌, ఇన్‌స్ట్రాగాం ద్వారానే.. నగదు రికవరీ, విదేశీ ఉద్యోగాల పేరుతోనే ఎర వేసి టోకరాలు వేయడం గమనార్హం. పూర్తి వివరాలు లేకపోయినా.. ఈ ఎని మిది విడతలకు ముందూ ఓసారి ఇతడు బాధితుడిగా మారినట్లు ఫిర్యాదు ఆధారంగా తెలుస్తోంది. 2025 ఆగస్టు నుంచి 2026 జూన్‌ వరకు జరిగిన ఈ ‘సీరియల్‌ సైబర్‌ క్రైమ్‌’పై ఎట్టకేలకు బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించడంతో గురువారం కేసు నమోదైంది. క్రిప్టోకరెన్సీ రిక వరీ పేరుతో రూ. 2,83,500, దుబాయ్‌ స్టోర్‌ కీపర్‌ వీసా పేరుతో రూ. 19,050, ఢిల్లీ పోలీసుల సంబంధాల పేరుతో రికవరీ ట్రేడింగ్‌ ద్వారా రూ. 27,653, సింగపూర్‌ ఉద్యోగ వీసా ప్రాసెసింగ్‌ పేరుతో రూ. 25,000, ఐ4సీ, హ్యాకర్ల ద్వారా డబ్బు రికవరీ చేస్తా మని రూ. 31,500, అమెరికా ఫ్రూట్‌ పికింగ్‌ ఉద్యోగ వీసా పేరుతో రూ. 69,200, కెనడా ఫుడ్‌ ప్యాకింగ్‌ ఉద్యోగం పేరుతో రూ.35,000, యూకే సంస్థ పేరుతో బ్యాంక్‌ వెరిఫికేషన్‌ రికవరీ కోసం రూ. 23,400 సైబర్‌ నేరగాళ్లు బాధితుడి నుంచి స్వాహా చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పదేపదే మోసపోయిన షేక్‌పేటవాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement