ట్రాఫిక్‌కు పెట్టాలింక చెక్‌! | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌కు పెట్టాలింక చెక్‌!

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

తుర్కయంజాల్‌: గ్రేటర్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పలు ప్రధాన రహదారులను కలుపుతూ లింక్‌ రోడ్లు నిర్మించాలని భావించిన ప్రభుత్వం ఇప్పటికే పలుచోట్ల సర్వే పూర్తి చేసింది. కన్సల్టెన్సీలు ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు మరోసారి క్షేత్ర స్థాయి పరిశీలన చేపడుతున్నారు. సర్వే నివేదిక ఆధారంగా నష్టపోతున్న నిర్మాణాలు, ప్లాట్లు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులపై మరోసారి నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్‌ జోన్‌ పరిధిలోని ఆదిభట్ల సర్కిల్‌ పరిధిలో గురువారం అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ శ్రీధర్‌ రెడ్డి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వెంకట్‌ రఘునాథ్‌ నాగార్జున సాగర్‌ రహదారి నుంచి తొర్రూర్‌ వరకు సర్వే పూర్తయిన రోడ్డును పరిశీలించారు.

ప్రత్యామ్నాయ మార్గాలుగా..

నగరంతో పాటు, శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా ప్రధాన జంక్షన్‌లకు ప్రత్యామ్నాయ మార్గాలుగా స్లిప్‌ రోడ్లు ఉపయోగపడనున్నాయి. మొదటి సారిగా 2019లో జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం వీటికి రూపకల్పన చేసింది. మొత్తం రెండు దశల్లో కలిపి 31 రహదారులను పూర్తి చేశారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యకు విముక్తి లభించింది. కొత్తగా వేసే రోడ్లతో రియల్‌ ఎస్టేట్‌ పుంజుకోనుంది.

ఆదిభట్ల సర్కిల్‌లో..

మూడో విడతలో భాగంగా శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, ఖైరతాబాద్‌ జోన్‌ల పరిధిలో మొత్తం 18 రోడ్లు వేయాల్సిన అవసరం ఉందని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఒక్క శంషాబాద్‌ జోన్‌లోనే పది రోడ్లు ఉన్నాయి. తుర్కయంజాల్‌లోని నాగార్జున సాగర్‌ రహదారి నుంచి తొర్రూర్‌ వరకు 1.6 కి.మీ మేర 100 ఫీట్లతో రోడ్డు నిర్మించనున్నారు. సర్వే నంబర్‌ 212 నుంచి ప్రారంభమై, మస్కతి డెయిరీకి చెందిన భూముల్లో నుంచి హైటెన్షన్‌ లైన్‌ కింద నుంచి రోడ్డు నిర్మించనున్నారు. ఇంజాపూర్‌లోని బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి దిలావర్‌ఖాన్‌ చెరువు మీదుగా మునగనూర్‌ వరకు 2 కి.మీ మేర రోడ్డు వేయాలని నిర్ణయించారు.

రోడ్డు వేయనున్న ప్రాంతాలు (కి.మీ.లలో)

● నాగార్జున సాగర్‌ రోడ్డు నుంచి

తొర్రూర్‌ వరకు: 1.6

● ఇంజాపూర్‌ నుంచి

మునగనూర్‌: 2

● బడంగ్‌పేట– నాదర్‌గుల్‌ మెయిన్‌ రోడ్డు నుంచి నాదర్‌గుల్‌ వరకు: 2.6

● నాదర్‌గుల్‌ రామాలయం మీదుగా

బడంగ్‌పేట ప్రధాన రహదారి నుంచి తుర్కయంజాల్‌ వరకు: 3.8

● మల్లాపూర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి

కుర్మల్‌గూడ: 3.2

● కుర్మల్‌గూడ నుంచి

నాదర్‌గుల్‌: 3.3

● ఆర్‌సీఐ ఎక్స్‌ రోడ్డు నుంచి

శ్రీశైలం హైవే: 2.6

● శంషాబాద్‌ రైల్వే క్రాసింగ్‌ నుంచి

ధర్మగిరి రోడ్డు: 5

● శంషాబాద్‌ బస్టాప్‌ నుంచి

రాళ్లగూడ రోడ్డు:4

● ఎన్‌హెచ్‌ 44 తొండుపల్లి నుంచి

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు: 3

రాజేంద్రనగర్‌ జోన్‌ పరిధిలో..

● బైరారిగూడ నుంచి

నార్సింగి వరకు: 0.85

● ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు నుంచి

చేవెళ్ల రోడ్డు వయా కిస్మత్‌పూర్‌: 5.5

● కిస్మత్‌పూర్‌ నుంచి

ఆర్‌అండ్‌బీ రోడ్డు ప్రెస్టీజ్‌ విల్లాస్‌: 2.05

● దర్గా నుంచి

ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌: 0.85

● ఫార్మాయిష్‌ హోటల్‌ నుంచి

తారామతి బారాదరి వరకు: 2.5

● బాపుఘాట్‌ బ్రిడ్జి నుంచి పీఅండ్‌టీ కాలనీ వరకు ఈస్ట్‌ నుంచి ఇసా రివర్‌ వరకు: 2.1

ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో..

● గ్రీన్‌ ల్యాండ్‌ జంక్షన్‌ నుంచి

నెక్లస్‌రోడ్డు జంక్షన్‌ వరకు: 1.6

● నెక్లస్‌రోడ్డు రైల్వే స్టేషన్‌ నుంచి

పాటిగడ్డ వరకు: 1

ప్రత్నామ్నాయ మార్గాలు

ప్రధాన రహదారులను

కలుపుతూ లింక్‌ రోడ్ల నిర్మాణం

ఇప్పటికే కన్సల్టెన్సీల ద్వారా

పలుచోట్ల సర్వే

క్షేత్రస్థాయి పరిశీలనలో

టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

ఒక్క శంషాబాద్‌ జోన్‌లోనే పది రోడ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement