ప్రతీ మహిళకు చదువుకునే హక్కుంది | - | Sakshi
Sakshi News home page

ప్రతీ మహిళకు చదువుకునే హక్కుంది

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి ప్రతి మహిళకు చదువుకునే హక్కు ఉందని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి పేర్కొన్నారు. ఉల్లాస్‌, టాస్‌ కార్యక్రమం విజయవంతం కోసం గురువారం కలెక్టరేట్‌ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ.. శుక్రవారం 10.30 నుంచి 12.30 గంటల వరకు మండల విద్యాధికారి కార్యాలయంలో ప్రతి మండల రిసోర్స్‌ సెంటర్‌లో ఉల్లాస్‌, టాస్‌పై అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. సెర్ప్‌ ఏపీఎంలు, జీహెచ్‌ఎంసీ టీఎంసీలు హాజరై ప్రతి స్వయం సహాయక సంఘం నుంచి ఒక మహిళను ఉల్లాస్‌ తరగతులకు సమీకరించాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉల్లాస్‌ అక్షరాస్యత అభ్యసన కేంద్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఎంఈఓలు గ్రామీణ, పట్టణ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాల అనంతరం సాయంత్రం 3.30 నుంచి 4 గంటల వరకు నిత్యం ఉల్లాస్‌ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. దీని ద్వారా జిల్లా అక్షరాస్యత పెంచాలన్నారు. ప్రతి మండల మహిళా సమాఖ్యలో ఉల్లాస్‌ పుస్తకాలు, టీఎల్‌ఎం అందుబాటులో ఉన్నాయని, వీటిని క్షేత్రస్థాయి వరకు అందించాలన్నారు.

దాతలు ముందుకు రావాలి

తుక్కుగూడ: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ర్థులకు మౌలిక వసతుల కల్పన కోసం దాతలు ముందుకు రావాలని అదనపు కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. తుక్కుగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు సర్దార్‌నగర్‌ గ్రామానికి చెందిన ఈదులకంటి చిరంజీవిగౌడ్‌ రూ.25 లక్షల విలువైన బస్సును బహూకరించారు. ఈ బస్సును గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ కస్నానాయక్‌, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, పాఠశాల చైర్మన్‌ వనిత, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement