సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూభారతి సిస్టంపై పూర్తి అవగాహనతో ప్రజలకు సమర్థవంతమైన సేవలందించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి సిస్టమ్ ద్వారా భూ రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ప్రతి జూనియర్ అసిస్టెంట్ భూభారతి సిస్టమ్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో వివరించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకుని, రోజువారీ విధుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. భూ సంబంధిత దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల నమోదు, ధ్రువీకరణ తదితర ప్రక్రియల్లో కచ్చితత్వాన్ని పాటిస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లా టెక్నికల్ మేనేజర్ రఘు భూభారతి సిస్టమ్‌లోని వివిధ మాడ్యూల్స్, విధానాలు, సాంకేతిక అంశాలపై జూనియర్ అసిస్టెంట్లకు సమగ్ర శిక్షణ అందించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి (ఏఓ) సునీల్, సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి


