చదువుతోనే.. గౌరవం, గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే.. గౌరవం, గుర్తింపు

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

ప్రిస్క్రిప్షన్‌ లేకుండా.. డాక్టర్‌ ప్రిస్క్రిప్సన్‌ లేకుండా..అక్రమంగా ట్రమడాల్‌ మాత్రలు విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 8లోu

ప్రిస్క్రిప్షన్‌ లేకుండా.. డాక్టర్‌ ప్రిస్క్రిప్సన్‌ లేకుండా..అక్రమంగా ట్రమడాల్‌ మాత్రలు విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

శంకర్‌పల్లి: చదువుతోనే ప్రతీ ఒక్కరికి గౌరవం, గుర్తింపు లభిస్తోందని అదనపు కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. బుధవారం మున్సిపల్‌ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ‘అమ్మకు అక్షరమాల–ఉల్లాస్‌’కార్యక్రమం నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన అమ్మమ్మ భూమి అమ్మి.. తన తల్లిని చదవించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని చేసిందని గుర్తు చేసుకున్నారు. నిరక్షరాస్యులైన ప్రతీ మహిళ వయస్సుతో సంబంధం లేకుండా చదువు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. చదువుకున్న మహిళలు ఉన్న కుటుంబం నైపుణ్యత, ఆర్థికంగా రాణిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మకు ‘అక్షరమాల–ఉల్లాస్‌’కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపాలిటీలో పని చేస్తున్న 81మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా ధృవీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు రోడ్లు, డ్రైన్లు పూర్తి నాణ్యతతో నిర్మించాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమ్మకు అక్షరమాల–ఉల్లాస్‌ ప్రాజెక్టు జిల్లా డైరెక్టర్‌ అనిత, మెప్మా పీడీ వెంకటనారాయణ, శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ సాత ప్రవీణ్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ యోగేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ శ్వేత, మేనేజర్‌ అంజన్‌ కుమార్‌, పర్యావరణాధికారి ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు.

‘ఉల్లాస్‌’లో ఆదర్శ జిల్లాగా నిలపాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఫంక్షనల్‌ లిటరసీ అసెస్‌మెంట్‌ టూల్స్‌(ఎఫ్‌ఎల్‌ఏటీ)–ఓపెన్‌ స్కూల్‌ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ కిరణ్మయి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో నిర్వహించనున్న ఎఫ్‌ఎల్‌ఏటీ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఉల్లాస్‌ అభ్యాసకులంతా పరీక్షకు హాజరై ఉత్తీర్ణులయ్యేందుకు అవసరమైన చర్యలు సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ప్రతీ అభ్యాసకుడికి పరీక్షపై పూర్తి అవగాహన కల్పించి, లెర్నింగ్‌ సెంటర్లలో క్రమం తప్పకుండా తరగతులు నిర్వహిస్తూ ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాజరునమోదు, రవాణా, పరీక్షా కేంద్రాల నిర్వహణ, అభ్యాసకులకు సమాచారం చేరవేత తదితర అంశాలపై సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగస్వామ్యమైన అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేసి జిల్లాను ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యుమరసీ అసెస్‌మెంట్‌ టెస్ట్‌(ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ)–నేషన్‌ ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓస్‌) పరీక్షల్లో ఆదర్శ జిల్లాగా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, మెప్మా పీడీ వెంకటనారాయణ, వయోజన విద్యాశాఖ జిల్లా అధి కారి అనిత, జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ కిరణ్మయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement