కడ్తాల్: భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే పాఠశాల స్థాయి నుండే పర్యావరణ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, సీజీఆర్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి అన్నారు. అన్మాస్‌పల్లి ఎర్త్‌సెంటర్‌లో సీజీఆర్ పర్యావరణ సంస్థ–తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎంపిక చేసిన కేజీబీవీల ఉపాధ్యాయులకు యంగ్ ఎర్త్ లీడర్ శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన అనంతరం సీజీఆర్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ ద్వారా 50 వేలకు పైగా విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నీటి సంరక్షణ, అటవీ పరిరక్షణ, వ్యర్థాల నిర్వాహణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, కిచెన్‌గార్డెన్‌ల ఏర్పాటు, వనమహోత్సవం, జీవవైవిధ్యం తదితర అంశాలపై ఆచారణత్మతక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ఉపేందర్‌రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త ఉమామహేశ్వర్‌రెడ్డి, వైఈఎల్పీ స్టేట్ కోఆర్డినేటర్ వెంకట్‌రెడ్డి, సీజీఆర్ ఇన్‌చార్జి రజనీకాంత్, కార్యక్రమ అధికారి నవ్య, టెక్నికల్ అసిస్టెంట్ సాక్షి, మద్దిలేటి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి


