15 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

15 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

రూ.75,400 నగదు,

పది సెల్‌ఫోన్లు స్వాధీనం

కడ్తాల్‌: మద్యం సేవిస్తూ పేకాడుతున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందిన కొంత మంది వ్యక్తులు బుధవారం మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయ సమీపంలోని ఓ హాల్లో పేకాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్‌ చేసి రూ.72,400 నగదు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

20 క్వింటాళ్ల

రేషన్‌ బియ్యం సీజ్‌

ఆమనగల్లు: పేదలకు ఇవ్వాల్సిన రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా తలకొండపల్లి పోలీసులు పట్టుకున్నారు. తలకొండపల్లి సీఐ జానకిరామ్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. ఆమనగల్లు మండలం మేడిగడ్డతండాకు చెందిన నేనావత్‌ మణిపాల్‌, తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌ రేషన్‌ డీలర్‌ మల్లయ్య కలిసి రేషన్‌బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు బుధవారం బియ్యాన్ని తరలిస్తుండగా చుక్కాపూర్‌ సమీపంలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా మహేంద్ర మినీ ట్రక్‌ వాహనంలో 40 సంచులలో 20 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని వాహనాన్ని సీజ్‌ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆచారంలో ప్రచారం.. భక్తుల విచారం!

కేశంపేట: మండల పరిధిలోని సంగెం గ్రామంలో బుధవారం నిర్వహించిన బోనాల వేడుకల్లో పోతురాజు వేషధారణ చర్చనీయాంశమైంది. వేషం ధరించిన వ్యక్తి నుదుటిపైన బీఆర్‌ఎస్‌ అని రాసుకోవడంపై భక్తులు, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా, అనాది ఆచారంగా జరుపుకొంటున్న పండుగలో పార్టీల ప్రస్తావన తేవడం తగదని సూచించారు. ఇలాంటి చర్యలు భక్తులు, ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తాయని సూచించడంతో సదరు వ్యక్తి తన నుదుటిపై రాసుకున్న బీఆర్‌ఎస్‌ అనే అక్షరాలను చెరిపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement