ఎంఆర్‌ఐ ప్రేమ్ కుమార్
తుర్కయంజాల్: వరుస వివాదాలకు కారణమైన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ సర్వే నెంబర్ 338లోని భూమిని స్వాధీనం చేసుకున్నామని ఎంఆర్‌ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మా ట్లాడుతూ.. ఈ భూమి పూర్తిగా రెవెన్యూ విభాగం ఆధీనంలో ఉందని.. ఎవరైనా ప్రవేశించినా, స్థలాన్ని కొనుగోలు, విక్రయాలు చేసినా, అనుమతి లేని నిర్మాణాలు చేపట్టిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్, పోలీస్‌శాఖల అధికారులతో కలి సి పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకు ని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
అధిక వడ్డీ పేరుతో మోసం
మణికొండ: తమ వద్ద రూ.లక్షల్లో అప్పు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని పలువురు బీఆర్‌ఎస్ మహిళా నేత ఇంటివద్ద ఆందోళనకు దిగారు. బీఆర్‌ఎస్ మణికొండ పాత మున్సిపాలిటీ మాజీ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి పుప్పాలగూడలోని తిరుమలహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఏళ్ల క్రితం అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటంతో బుధవారం బాధితులు ఆమె ఇంటికి వచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే కాలనీకి చెందిన రాణి అనే మహిళ తన వద్ద రూ.9లక్షలు తీసుకుని కొద్ది నెలల్లోనే అసలుతో పాటు 30శాతం అధికంగా ఇస్తామని చెప్పి తీసుకుందని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవటం, ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యిందని, తమను దుర్బాషలాడటంతో పా టు చంపేస్తానని బెదిరించిందని ఆమె ఫిర్యా దులో పేర్కొన్నారు. రూపారెడ్డి ఇంటికి వచ్చి న వారిలో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. తన కుమార్తెకు ఎమ్మెల్యే కుమారుడితో వివా హ నిశ్చితార్థం జరిగినందున తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని, తనకు బీఆర్‌ఎస్ నాయకులు అండగా నిలవాలని, పోలీసులు భద్రత కల్పించాలని రూపారెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే ఆమె ఇంటికి వచ్చిన బాధితులను సముదాయించారు. బాధితురాలు రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


