అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని జాఫర్‌గూడ గ్రామం చెరువు అలుగుతో పాటు నక్షబాటను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న నోవా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మాజీ ఉపసర్పంచ్ దేశట్ల శేఖర్‌యాదవ్ మంగళవారం తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సర్వేనంబర్ 321లోంచి ఉన్న నక్షబాటను, జాఫర్‌గూడ చెరువు అలుగు వద్ద అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, దీంతో గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అడ్డుకునేందుకు యత్నిస్తున్న స్థానికులపై కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.


