ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ | - | Sakshi
Sakshi News home page

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ

Aug 4 2026 9:54 AM | Updated on Aug 4 2026 9:54 AM

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణ పదో రోజుకు చేరిన రిలే దీక్షలు

చేవెళ్ల: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా చేవెళ్ల ప్రాంతానికి చెందిన వడ్ల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తుక్కుగూడలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కులకోసం, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన సీపీఐ జిల్లా కార్య దర్శి పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, కె. రామస్వామి తదితరులకు కృతజ్ఞ తలు తెలిపారు.

ఇబ్రహీంపట్నం: దండుమైలారం గ్రామంలో ఆక్రమణకు గురైన గ్రామకంఠం భూ సాధనే లక్ష్యంగా చేపట్టిన రిలే దీక్షలు పదో రోజుకు చేరాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షల్లో సోమవారం యాదవ కులస్తులు కూర్చున్నారు. సర్పంచ్‌ ఈదులకంటి నరేష్‌గౌడ్‌ వారికి సంఘీభావం ప్రకటించారు. ఆక్రమణకు గురైన గ్రామ కంఠం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement