తాండూరు: శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సోదరులు సోమవారం కాశీలోని గంగానదిలో తమ తల్లి రుక్కమ్మ అస్తికలను నిమజ్జనం చేశారు. అనంతరం రుక్కమ్మ మనవళ్లు అవినాష్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులతో కలిసి కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు.
ఇంట్లో పేలిన సిలిండర్ :
తండ్రి, ముగ్గురు చిన్నారులకు గాయాలు
మేడ్చల్ రూరల్: గ్యాస్ సిలిండర్ స్టవ్ నుంచి మారుస్తుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో తండ్రితో పాటు ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. మేడ్చల్ పోలీసులు తెలిపిన మేరకు.. ఎల్లంపేట మున్సిపాలిటీ శ్రీరంగవరం గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్(37) ఇంట్లో ఆదివారం గ్యాస్ లీకేజీ అవుతున్నట్లు గుర్తించి సిలిండర్ రెగ్యులేటర్‌ను మార్చేందుకు యత్నించాడు. సిలిండర్ పక్కనే దీపం ఉండడంతో గ్యాస్ లీకై మంటలు అంటుకొని సిలిండర్ పేలిపోయింది. దీంతో శ్రీనివాస్(37)తో పాటు అక్కడే నిద్రిస్తున్న కూతుళ్లు ప్రవళిక (14), హరిప్రియ(10), కుమారుడు విక్రాంత్ (6) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు.


