ఎలానో! | - | Sakshi
Sakshi News home page

ఎలానో!

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026

న్యూస్‌రీల్‌

రంగారెడ్డి
శనివారం శ్రీ 1 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ఎల్‌నినో.. కూరలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఒకప్పుడు టన్నుల కొద్ది కూరగాయలు అందించి నగరవాసుల అవసరాలు తీర్చిన ఉమ్మడి జిల్లా రైతులు నేడు సాధారణ పచ్చిమిర్చి కోసం పక్కచూపులు చూడాల్సి వస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ కారణంగా ఇప్పటికే సాగువిస్తీర్ణం భారీగా పడిపోయింది. తాజాగా దీనికి ఎల్‌నినో తోడైంది. డిమాండ్‌ మేరకు సాగు, దిగుబడి లేకపోవడంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రూ.1, రూ.2కే లభించిన కొత్తిమీర, పుదీన కట్టలు.. ప్రస్తుతం కనీసం రూ.10 చెల్లిస్తే కానీ చేతికి అందడం లేదు. ఒక్క ఆకుకూరలే కాదు ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.60పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇక పూలు, పండ్ల ధరలకై తే అంతే లేదు. బహిరంగ మార్కెట్లో చామంతి, గులాబీ ఇలా దేని ధర చూసినా కేజీ రూ.400పైగా పలుకుతోంది.

800 మెట్రిక్‌ టన్నుల లోటు

నగరంలో గుడిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి, మాదన్నపేట్‌, ఎల్బీనగర్‌ హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. వీటితో పాటు ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సనత్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఫలక్‌నుమా, కూకట్‌పల్లి, మేడ్చల్‌ రైతుబజార్లు ఉన్నాయి. నగరవాసుల అవసరాలు తీరాలంటే రోజుకు కనీసం 3,500 మెట్రిక్‌ టన్నుల కూరగాయలు దిగుమతి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయా మార్కెట్లకు 2,800 మెట్రిక్‌ టన్నులకు మించి సరఫరా కావడం లేదు. స్థానికంగా ఆశించిన స్థాయిలో పంటసాగు విస్తీర్ణం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కర్ణాటక నుంచి మిర్చి, క్యాలీఫ్లవర్‌, బీన్స్‌ వంటి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆగ్రా నుంచి ఆలుగడ్డ వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లాల నుంచి ఉల్లిని తెప్పించుకోవాల్సి వస్తోంది. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతుండటంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రోజుకు అరకేజీ కూరలు వాడిన వారు భారీగా పెరిగిన ధరలతో ప్రస్తుతం పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు.

ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుపై ప్రభావం

ఆశించిన స్థాయిలో నమోదు కాని పంటలు

సరఫరాకు, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వైనం

ఎల్‌నినో.. కేవలం వరి, పత్తి పంటలపైనే కాదు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుపైనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, బోరుబావుల్లోని మోటార్లు ఆగిపోవడంతో ఉమ్మడిజిల్లాలో ఆయా పంటల సాగు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement