షాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్‌గౌడ్ కార్యకర్తలకు సూచించారు. మండల పరిధిలోని కుర్వగూడ, నాగరగూడ, తాళ్లపల్లి గ్రామాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాని అన్నారు. బీజేపీతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పార్టీ బలమైన శక్తిగా మారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీశైలం, జిల్లా కార్యదర్శి శ్రీకృష్ణ, మండల అధ్యక్షుడు మద్దూరు మాణెయ్య, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, నాయకులు మహేందర్, రాము, హరీష్, కిరణ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్‌గౌడ్


