షాబాద్: శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌర్ పరామర్శించారు. మహేందర్‌రెడ్డి తల్లి పట్నం రుక్కమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనరెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే రమేశ్‌మహరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధూసూదన్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, పామెన భీంభరత్, కాలె శ్రీకాంత్, పెంటారెడ్డి, సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


