మూడు రోజులే సర్‌ | - | Sakshi
Sakshi News home page

మూడు రోజులే సర్‌

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

నియోజకవర్గాల వారీగా సర్‌ ప్రక్రియ వివరాలు ఇదే చివరి అవకాశం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) కార్యక్రమంలో భాగంగా ఓటర్లు నింపిన తమ ఎన్యూమరేషన్‌ ఫాంలను తిరిగి సమర్పించేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలింది. గడువు సమీపిస్తుండడం, ఇప్పటి వరకు డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. డిజిటలైజేషన్‌ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో 62 శాతం నమోదు కాగా, వికారాబాద్‌ జిల్లాలో 76.60 శాతం మాత్రమే నమోదయింది.

ఎనిమిది నియోజకవర్గాలు 62%

జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, వీటి పరిధిలో 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. బూత్‌ లెవల్‌ సిబ్బంది ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫాంలు అందజేసినట్లు స్పష్టం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 23,07,899 మంది మాత్రమే తమ ఫాంలు తిరిగి బీఎల్‌ఓలకు ఇచ్చారు. మరో 13,91,844 మంది ఓటర్లు మిగిలి పోయారు. నిర్దేశిత గడువులోగా ఫాంలు సమర్పించని వారు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది.

కొడంగల్‌లో అత్యధికం..

తాండూరులో అత్యల్పం

జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా, 10,17,671 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 7,81,555 మంది ఓటర్లకు సంబంధించి 76.80 శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. మరో 2,36,116 ఓట్లకు సంబంధించి సందిగ్ధం నెలకొంది. కొడంగల్‌లో అత్యధికంగా 82 శాతం పూర్తి కాగా, తాండూరులో 72 శాతం, వికారాబాద్‌లో 75 శాతం, పరిగిలో 78 శాతం నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వికారాబాద్‌ జిల్లాలో ఆశించిన స్థాయి లో ఎన్యూమరేషన్‌ ప్రక్రియ కొనసాగక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణ లోపం వల్లే తక్కువ శాతం నమోదుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఎన్యూమరేషన్‌ ఫాంలపై అవగాహన లేదు. బీఎల్‌ఓలు.. కేవలం ఫాంలు చేతికిచ్చి వదిలేశారు. అవగాహన లేక ప్రజలు వాటిని నింపి తిరిగి ఇవ్వడం లేదు.

నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్‌ శాతం

ఇబ్రహీంపట్నం 344584 244020 70.82

ఎల్బీనగర్‌ 608203 322025 52.95

మహేశ్వరం 574637 319589 55.62

రాజేంద్రనగర్‌ 635283 364234 57.33

శేరిలింగంపల్లి 773372 425591 55.03

చేవెళ్ల 273883 214296 78.24

కల్వకుర్తి 245355 212805 86.77

షాద్‌నగర్‌ 244426 205317 84.00

మొత్తం 62.38

ఎన్యూమరేషన్‌ ఫాంలు సమర్పించేందుకు ఇదే చివరి అవకాశం. ఫాంలు తిరిగి ఇవ్వని వారు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి రెండు చోట్ల ఫాంలు ఇవ్వొద్దు. రెండు చోట్ల ఓటు హక్కును కలిగిన వారు.. ప్రస్తుతం ఏదో ఒక చోటును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఎన్నికల కమిషన్‌ కఠినంగా వ్యవహరించబోతోంది.

– నారాయణరెడ్డి, కలెక్టర్‌

జిల్లాలో 62 శాతం మించని డిజిటలైజేషన్‌

36,99,743 మంది ఓటర్లకు.. ఎన్యూమరేషన్‌ ఫాంలు తిరిగి ఇచ్చింది 23,0328 మందే

ఆగస్టు 3వ తేదీన ముగియనున్న ప్రక్రియ

గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారుల సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement