రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి చేవెళ్ల: ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేశ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ మల్గార్‌ వైభవ్‌రెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద, శ్రీచైతన్య కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అభినయ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌ బకాయిల కారణంగా కళాశాలల ఆర్థిక పరిస్థితి సైతం దెబ్బతింటోందని విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్‌ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్‌, ఆంజనేయులుగౌడ్‌, జిల్లా కార్యదర్శి కృష్ణగౌడ్‌, బీజేవైఎం నాయకులు ఇంద్రసేనారెడ్డి, పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్‌, ప్రవీణ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జయశంకర్‌గౌడ్‌, సత్యనారాయణ, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌, శివకుమార్‌, అశోక్‌, అభిషేకర్‌రెడ్డి, వెంకటేశ్‌, గణేశ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్‌

విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్‌ రాజకీయాలు

షాబాద్‌: విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్‌ విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మద్దూరు మాణెయ్య అధ్యక్షతన ఎస్‌ఐఆర్‌పై చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌. రత్నం, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కొలువుదీరనుందని బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు దొంగ ఓట్లతో గద్దెనెక్కాయని సర్‌ ప్రక్రియతో ఇవన్నీ పోతాయన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్సమెంట్‌ ఇవ్వకుండా కాలయాపన చేయడం తగదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సోద రులతో కలిసి ఫ్యూచర్‌ సిటీ పేరిట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని రైతుల భూములు లాక్కుని వారని ఇబ్బంది పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మమతారెడ్డి, సర్పంచ్‌ బందయ్య, నాయకులు మహేందర్‌, హరీశ్‌, రాము, మహేశ్‌, శేఖర్‌, విజయ్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement