వాన కురిసె.. రైతు మురిసె | - | Sakshi
Sakshi News home page

వాన కురిసె.. రైతు మురిసె

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

రంగారెడ్డి జిల్లాలో

వర్షపాత వివరాలు

వికారాబాద్‌ జిల్లాలో

వర్షపాత వివరాలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షం దంచి కొడుతోంది. వికారాబాద్‌లోని కాగ్నా నది సహా రంగారెడ్డి జిల్లాలోని ఈసీ, మూసీ వాగులకు వరద పోటెత్తుతోంది. మొన్నటి వరకు చుక్క నీరు లేక వెలవెల బోయిన చెరువులు, కుంటలు కొత్తనీటి రాకతో కళకళలాడుతతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై వరద చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్‌ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ వరకు బీఎన్‌రెడ్డి నుంచి ఇబ్రీహీంపట్నం వరకు, పహడీషరీఫ్‌ నుంచి తుక్కుగూడ వరకు, శంషాబాద్‌ నుంచి కొత్తూరు వరకు, బాపూఘాట్‌ నుంచి మొయినాబాద్‌ వరకు నార్సింగి నుంచి శంకర్‌పల్లి వరకు ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. కొత్తనీటి రాకతో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఆలస్యంగానైనా ఆశించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుండడంతో రైతుల ముఖాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గులో అధిక వర్షపాతం నమోదవగా కడ్తాల్‌, మాడ్గుల, ఇబ్రహీంపట్నం, మంచాలలో 0.6 సెం.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలో బషీరాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదవగా మిగిలిన మండలాల్లో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాగ్నా నదిలో వరద పోటెత్తగా.. చిట్టంపల్లి బ్రిడ్జి దెబ్బతింది. గ్రామీణ రోడ్లు చిత్తడిగా మారాయి. ఇప్పటికే మొలకెత్తి.. నీళ్లు లేక వాడిపోయిన పత్తి, ఇతర పంటలకు తాజా వర్షాలు మళ్లీ జీవం పోసినట్లుఅయింది.

ప్రాంతం నమోదైన వర్షపాతం

(సెం.మీలలో)

కొందుర్గు 5.33

చౌదరిగూడ 4.21

ఫరూఖ్‌నగర్‌ 3.19

షాబాద్‌ 3.08

చేవెళ్ల 2.54

శంషాబాద్‌ 2.72

కేశంపేట 2.67

హయత్‌నగర్‌ 2.58

ప్రాంతం నమోదైన వర్షపాతం

(సెం.మీలలో)

బషీరాబాద్‌ 4.98

వికారాబాద్‌ 3.71

పూడూరు 4.34

బొంరాస్‌పేట 4.28

ధారూరు 4.20

దౌల్తాబాద్‌ 4.32

యాలాల 4.31

పంటలకు ప్రాణం పోసిన వర్షం

వికారాబాద్‌ జిల్లాలో

3.37 సెంటీమీటర్లు,

రంగారెడ్డిలో 2.07 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

చెరువులు, కుంటలకు జలకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement