సమస్యల ఏలుబడి!
కందుకూరు: కందుకూరు బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. సరిపడా గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో మొత్తం 110 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో ఆరు గదులు ఉండగా అందులో ఆఫీస్, స్టాఫ్, ల్యాబ్ కోసం ఓక్కో గదిని కేటాయించారు. మిగతా మూడు గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో మన ఊరు –మన బడి పథకం కింద రెండు గదుల నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరయ్యాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పిల్లర్ల వరకే నిర్మాణం పూర్తి చేయగా, ఆ లోపు ప్రభుత్వం మారడంతో నిధులు విడుదల కాక వదిలేశాడు. దాని పక్కనే అంత కంటే ముందే బాలుర, బాలికల పాఠశాలలకు కలిపి సైన్స్ ల్యాబ్ నిర్మాణం పక్కపక్కనే చేపట్టారు. అది కూడా అసంపూర్తిగా నిలిచిపోయింది.
పెచ్చులూడిన
భవనం పైకప్పు


