ఇబ్రహీంపట్నం రూరల్: మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. మంగళ్‌పల్లిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కళాశాలను శనివారం ఆమె తనిఖీ చేశారు. భవనంలో వసతులు, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖారున కళాశాల అగ్రిమెంట్ ముగుస్తున్నందున ఇదే కళాశాలలో కొనసాగించాలా లేక నగరంలోని వనస్థలిపురం సమీపంలో ఇతర వేరే భవనాలు చూడాలా అని చర్చించారు. సొంత భవనం నిర్మాణం జరిగే వరకు సర్దుబాటు కాక తప్పదన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి


