కడ్తాల్: మండల పరిధిలోని రావిచేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలో 6 నుంచి 10 తరగతులు కొనసాగుతు న్నాయి. మొత్తం 121 మంది వరకు బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. 6,7 తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు రేకులకు రంధ్రాలు పడి వర్షానికి ఉరుస్తోంది. ఎప్పుడు ఏం అవుతుందోనని విద్యార్థులు భయంగా గడుపుతున్నారు. ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన భవనం సైతం పెచ్చూలూడి పడుతోంది. పలు తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాలలో గతంలో నిర్మించిన మూత్రశాలలు అసంపూర్తిగా వదిలివేయడంతో ఆరుబయటకు వెళ్తున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు పాఠశాల ఆవరణలో నాలుగు రేకులతో తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశారు.


