పత్రీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
ధ్యానులతో కలిసి వేడుకల్లో పరిణిత ప్రతి తదితరులు
కడ్తాల్: ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగ కారిణి, సత్యజ్ఞాన ప్రసాధిని అంటూ ధ్యాన జగత్తుకు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ నిరంతరం కృషి చేసేవారని ధ్యానగురువు పరిణిత పత్రి అన్నారు. మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు మంగళవారానికి పదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పత్రీజీ ఆశయ సాధనకు, ధ్యానమయ ప్రపంచ కోసం ప్రతి ధ్యాని, ప్రతి పిరమిడ్ మాస్టర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు.


