వ్యక్తి అదృశ్యం
కేశంపేట: భార్యాభర్తలు గొడవపడటంతో భర్త అదృశ్యమైన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్క యాదయ్య, కేతమ్మ దంపతులు. సోమవారం పొలం వద్ద ఇద్దరూ గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన యాదయ్య ఎటో వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం యాదయ్య కుమారుడు నక్క గణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యుడు జనార్దన్
దుద్యాల్: గణితంపై భయం వీడి ఆలోచనతో నేర్చుకోవాలని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యుడు జనార్దన్ సూచించారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని కుదురుమల్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన గణిత మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన గణిత ఆకారాలను పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించారు. అనంతరం జనార్ధన్ మాట్లాడుతూ.. గణిత శాస్త్రం అంటే విద్యార్థులకు తెలియని భయం ఉంటుంది. సూత్రాలను నేర్చుకుంటే గణితం సులువు అని చెప్పారు. విద్యార్థులు ధైర్యంగా గణితాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం పూర్ణచందర్ రావు, సర్పంచ్ లాలప్ప, ఉప సర్పంచ్ ఝాన్సీలక్ష్మి, మాజీ సర్పంచ్ రఘుపతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జనార్ధన్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ విజయలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయ బృందం తరదితరులు పాల్గొన్నారు.
నేటి అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో బుధవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి, సాధారణంగా ప్రతిరోజూ రాత్రి 11 గంటలకు ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి సర్వీ సు బయలుదేరుతుంది. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణికుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం రాత్రి ఆలస్యంగా నడవనున్నాయని పేర్కొన్నారు.
వ్యక్తి అదృశ్యం


