‘ఫ్యూచర్’ కమిషనరేట్ ప్రారంభం
తొలి పోలీస్ కమిషనర్‌గాసుధీర్‌బాబు బాధ్యతలు కలెక్టరేట్‌లో తాత్కాలిక భవనం ఏర్పాటు
ఇబ్రహీంపట్నం పీఎస్ సందర్శన
ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను రాష్ట్రంలోనే ఉత్తమ కమిషనరేట్ గా తీర్చిదిద్దుతామని సీపీ సుధీర్‌బాబు అ న్నారు. కలెక్టరేట్ మొదటి అంతస్తులో ఏర్పా టు చేసిన ఫ్యూచర్ సిటీ నూతన కమిషనరేట్ కార్యాలయాన్ని మంగళవారం సా యంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం మొద టి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచ దేశాలకుతెలిసేలా ప్రభు త్వం ఇటీవల గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో భాగంగా ప్రాంభమైన ఫ్యూచర్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామని, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ వ్య వస్థలతో కలిసి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పని చేస్తామని తెలిపారు. విజబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్సిబులిటీతో మంచి సేవలందిస్తామన్నారు. కమిషనరేట్ పరిధిలో 22 పోలీస్ స్టేషన్లు ఉంటాయని వెల్లడించారు. మూడు జోనల్ డీసీపీలు, ఎస్‌ఓటీ, క్రైం, ట్రాఫిక్ బృందాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. వరల్డ్ క్లాస్ కమిషనరేట్ భవనం నిర్మించిన తర్వాత సొంత భవనంలో నుంచి సేవలందిస్తామన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకిరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు రవికుమార్, మహేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, నందీశ్వర్‌రెడ్డి, మధు తదితరులు నూతన సీపీకి పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ఇబ్రహీంపట్నం: శాంతియుతవాతావరణం నెలకొల్పడంలో, సమాజాభివృద్ధిలో పోలీసులదే కీలకపాత్ర అని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. కలెక్టరేట్‌లో కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. వివిధ అంశాలపై పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి ఉన్నారు.


