
విద్యుత్ శాఖలో అవినీతిపై అధికారుల ఆరా
మొయినాబాద్:విద్యుత్ శాఖలో అవినీతి దందాపై ఉన్నతాధికారులు విచారణ కు ఆదేశించారు. సోమ వా రం ‘సాక్షి’లో ‘కనెక్షన్.. కలెక్షన్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. విజిలెన్స్, ఇంటలిజన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమాలపై ఆరా తీశారు. మొయినాబాద్‌లో పర్యటించిన అధికారులు బాధితులను కలిసి విషయాలను తెలుసుకున్నారు. కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు, సిబ్బంది ఏ విధంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. ఎవరి ద్వారా తీసుకుంటున్నారనే విషయాలను రాబట్టినట్టు సమాచారం. విచారణలో వెలుగుచూసిన అంశాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
చిలుకూరు సన్నిధిలో
రాజవంశ సభ్యురాలు
మొయినాబాద్: తిరువనంతపురం రాజవంశ సభ్యురాలు, చారిత్రక రచయిత్రి, ప్రసిద్ధ కవి పద్మశ్రీ అశ్వతి తిరునాల్ గౌరి లక్ష్మీబాయి చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. సోమ వారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు రంగరాజన్ వారికి వాక్ పుస్తకాన్ని అందజేసి ఆలయ విశిష్టతను వివరించారు. లక్ష్మీబాయి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చక ట్రస్టీ కుటుంబానికి, తిరువనంతపురం పద్మనాభదాస రాజవంశానికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని మరోసారి గుర్తు చేశారని ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. తిరువనంతపురం చరిత్ర, పద్మనాభ స్వామి దేవాలయంపై ఆమె చేసిన రచనలు విశేష ఆదరణ పొందాయని చెప్పారు.
మైసిగండిని దర్శించుకున్న
చేవెళ్ల ఎమ్మెల్యే
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని సోమవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ అర్చక సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక సిబ్బంది శాలువా, పూలమాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, ట్రస్టీ శిరోలీ, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలను
సత్వరమే పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాల ని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వ హించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమస్యలు తెలపడానికి వచ్చిన వారి నుంచి అదన పు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్ ఓ సంగీత ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ..శాఖల వారీగా స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ వారం మొత్తం 74 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 38, ఇతర శాఖలకు సంబంధించి 36 వచ్చాయన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

విద్యుత్ శాఖలో అవినీతిపై అధికారుల ఆరా

విద్యుత్ శాఖలో అవినీతిపై అధికారుల ఆరా

విద్యుత్ శాఖలో అవినీతిపై అధికారుల ఆరా