
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కేశంపేట: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ నరహరి అన్నారు. ఇంటర్ స్టూడెంట్, పదో తరగతి విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో రాత్రి వేళ హుక్కా సేవించడంపై ఆదివారం ‘హాస్టల్‌లో హుక్కా’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీస్ అధికారులు స్పందించారు. సోమవారం మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్, సైబర్ క్రైమ్ అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నతంగా రాణించాలని సూచించారు. చదువు ద్వారా సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాజ్‌కుమార్, మండల విద్యాధికారి చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ అబ్దుల్ హమీద్, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం జ్యోతి, కళాశాల లెక్చరర్లు నారాయణ, లక్ష్మీరాజ్, మల్లేశ్, భరత్, ధృవకుమార్, అస్మా, రాణి, ఆసిఫొద్డీన్ తదితరులు పాల్గొన్నారు.
సీఐ నరహరి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి