
లారీ టైర్ల కింద నలిగి తండ్రీకూతురు దుర్మరణం
చేవెళ్ల: సిమెంట్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో తండ్రీకూతురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన తాండ్ర రవీందర్(32) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఏఎన్‌ఎంగా పనిచేసే భార్య రత్నమ్మ, కూతురు కృప(13), కొడుకు ఉన్నారు. మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట వద్ద కొనసాగుతున్న బంట్వారం ఎస్సీ గురుకుల పాఠశాలలో కృప 7వ తరగతి చదువుతోంది. కూతురుకు జ్వరం వచ్చిందని తెలియడంతో చూసివెళ్లేందుకు రవీందర్ హాస్టల్‌కు వచ్చాడు. బుధవారం వినాయక చవితి కూడా ఉండటంతో అనుమతి తీసుకుని కూతురుతో పాటు ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో చేవెళ్ల వద్ద వెనక నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్ అతివేగంగా బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ ఎగిరి కింద పడ్డారు. లారీ డ్రైవర్ వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లడంతో చక్రాల కింద నలిగిపోయారు. వెనక టైర్ల కింద పడిపోయిన రవీందర్‌ను చూసి, అడ్కడే ఉన్న స్థానికులు పెద్దగా అరిచారు. దీంతో డ్రైవర్ లారీని వెనక్కి తీయడంతో రవీందర్ మృతదేహం చక్రాల పైనున్న ఇనుప రేకుల మధ్య ఇరుక్కుపోయింది. ప్రమాదంలో తండ్రీకూతురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవీందర్, కృప మృతితో బీరెల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన చేవెళ్లకు బయలుదేరారు.
25సిహెచ్‌వి 04,
వెనక నుంచి బైక్‌ను ఢీకొట్టిన
సిమెంట్ ట్యాంకర్
హాస్టల్ నుంచి కూతురును ఇంటికి తీసుకెళ్తుండగా చేవెళ్ల వద్ద ఘటన
బీరెల్లిలో విషాదఛాయలు

లారీ టైర్ల కింద నలిగి తండ్రీకూతురు దుర్మరణం

లారీ టైర్ల కింద నలిగి తండ్రీకూతురు దుర్మరణం

లారీ టైర్ల కింద నలిగి తండ్రీకూతురు దుర్మరణం