
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ కె.రామారావు అన్నారు. పెన్షనర్ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినాన్ని పాటించాలని, ఉదయం 11 గంటలకు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాలన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సెప్టెంబర్ 15న ఉమ్మడి జిల్లాలో జరిగే జేఏసీ బస్సు యాత్రలో అధిక సంఖ్య లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి కార్యాచరణ నోటీసు అందజేశారు. పెన్షన్ విద్రోహదినం, హైదరాబాద్ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించా రు. కార్యక్రమంలో శ్రీనేష్‌కుమార్‌నోరీ, యశ్వంత్, వెంకటేశ్, నూతనకంటివెంకట్,శాంతిశ్రీ,రంగయ్య, అనిత,మహేశ్,ఈశ్వర్,బాలరాజ్‌గౌడ్ పాల్గొన్నారు.