ఎన్‌ఐఎంయూ, ఎఫ్‌సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఎంయూ, ఎఫ్‌సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన

Aug 12 2025 11:11 AM | Updated on Aug 12 2025 11:11 AM

ఎన్‌ఐ

ఎన్‌ఐఎంయూ, ఎఫ్‌సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన

● పంచాయతీ ట్రాక్టర్‌ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి ● మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్‌ ● పోలీసుల ఎదుట లొంగుబాటు

కందుకూరు: ఫ్యూచర్‌సిటీ భూముల్లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐఎంయూ), ఎఫ్‌సీడీఏ (ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ) కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ శ్రీదేవి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌, అర్బన్‌ ఎఫైర్స్‌ (ఎంఓహెచ్‌యూఏ) కార్యదర్శి కె.శ్రీనివాస్‌, జీహెచ్‌ఎంసీ కమిషన్‌ ఆర్‌వీ కర్ణన్‌ తదితరులు సోమవారం మండల పరిధిలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలోని సర్వే నంబర్‌ 112 లోని భూమిని పరిశీలించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ కోసం గతంలో కేటాయించిన 20 ఎకరాలు, ఎఫ్‌సీడీఏ కార్యాలయం కోసం అదే సర్వే నంబర్‌లో 7.20 ఎకరాలను క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు. వారి వెంట ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యావ్యవస్థ పటిష్టానికి కృషి

రాష్ట్ర విద్యా కమిషన్‌ మెంబర్‌

డాక్టర్‌ చారకొండ వెంకటేశ్‌

మాడ్గుల: విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర విద్యా కమిషన్‌ మెంబర్‌ చారకొండ వెంకటేశ్‌ అన్నారు. సోమవారం ఆయన మాడ్గుల జెడ్పీహెచ్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఫౌండేషన్‌ స్కూల్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసి సర్కార్‌ బడులను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దూర ప్రాంత విద్యార్థులకు స్కూల్‌ బస్‌లు ఏర్పాటు చేస్తామన్నా రు. త్వరలో 317 జీఓ రద్దు చేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని.. విద్యార్థుల భవిష్యత్‌ కోసం మరో గంట సమయం వెచ్చించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సర్ధార్‌ నాయక్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తది తరులు పాల్గొన్నారు.

అయ్యో అవంతిక

యాచారం: రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిని పంచాయతీ ట్రాక్టర్‌ పొట్టన పెట్టుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోనలి నక్కర్తమేడిపల్లికి చెందిన వన్నాడపు బీరప్ప, మానస దంపతుల కూతురు అవంతిక(3) సోమవారం సాయంత్రం ఇంటి ఎదుట ఆడుకుంటోంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ నడిపే జంగయ్య మద్యం మత్తులో చిన్నారిని బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. చిన్నారిని ఢీకొట్టిన డ్రైవర్‌ నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గ్రీన్‌ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ తెలిపారు.

నిమ్స్‌లో సుందరీకరణ పనులు షురూ..

లక్డీకాపూల్‌ : నిమ్స్‌ ఆస్పత్రి ప్రాంగణంలో సుందరీకరణ పనులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఆస్పత్రి ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 8న ఉద్యానవన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దోనెపూడి చక్రపాణి, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రణీత్‌ కౌర్‌తో కలిసి డైరెక్టర్‌ బీరప్ప భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.4 కోట్ల నిధులు కేటాయించింది. ఆ మేరకు సోమవారం ఆస్పత్రి ప్రాంగణాన్ని అహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు కాంట్రాక్టర్‌ పనులను ప్రారంభించారు. తొలుత క్లీనింగ్‌ పనులకు సమాయత్తమయ్యారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణమంతా పచ్చదనంతో కనువిందు చేసేలా గార్డెనింగ్‌ పనులు చేపడతారు.

ఎన్‌ఐఎంయూ, ఎఫ్‌సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన 
1
1/2

ఎన్‌ఐఎంయూ, ఎఫ్‌సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన

ఎన్‌ఐఎంయూ, ఎఫ్‌సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన 
2
2/2

ఎన్‌ఐఎంయూ, ఎఫ్‌సీడీఏ ఏర్పాటుకు స్థల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement