
‘ఇందిరమ్మ’ గృహప్రవేశం
షాద్‌నగర్: ఇందిరమ్మ పథకంలో భాగంగా హాజిపల్లిలో నిర్మించిన ఓ ఇంటిని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన ఒంటరి మహిళ స్వరూపకు ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి విడతల వారీగా లబ్ధిదారుకు డబ్బులు అందడంతో మూడు నెలల్లో పనులు పూర్తి చేయించింది. గృహ ప్రవేశ వేడుకకు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే హాజిపల్లికి వెళ్లారు. నియోజకవర్గంలో తొలి ఇంటిని పూర్తి చేసిన స్వరూపతో పాటు ఆమె కూతురు, అల్లుడికి నూతన వస్త్రాలు అందించి, సారె పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు రాగా వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా విడతలవారీగా డబ్బులు జమ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్‌ఖాన్, చల్లా శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, కొంకళ్ల చెన్నయ్య, హాజిపల్లి దర్శన్, శ్రీనివాస్, సత్యయ్య తదితరులు పాల్గొన్నారు.