తొలగింపా? | - | Sakshi
Sakshi News home page

తొలగింపా?

Aug 13 2025 7:46 AM | Updated on Aug 13 2025 7:46 AM

తొలగి

తొలగింపా?

లాభాల మునగ మునగ సాగుతో ఆశించిన దిగుబడులతో పాటు లాభాలు ఆర్జించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
పొడిగింపా..

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8లోu

పీఏసీఎస్‌లకు ఈ నెల 14తో ముగుస్తున్న గడువు

యాచారం: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)కు సర్కార్‌ పొడిగించిన ఆరు నెలల పదవీ కాలం గడువు ఈ నెల 14తో ముగియనుంది. మరో ఆరు నెలలు పొడిగిస్తారా.. లేదా అనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. పీఏసీఎస్‌లకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 16న చైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16తో ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలల పదవీ కాలాన్ని పొడిగించింది. పొడిగించిన పదవీ కాలం మరో రెండు రోజుల్లో ముగిసే అవకాశం ఉన్నప్పటికీ ఏ నిర్ణయం వెలువడకపోవడంతో అటు అధికారులు, ఇటు పాలకవర్గ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో ఆరు నెలల గడువు పొడిగించాలా.. లేదా పాలకవర్గాలను రద్దు చేసి పీఏసీఎస్‌, డీసీసీబీ చైర్మన్లను నామినేటెడ్‌ పద్ధతిలో నియమించాలా అనే విషయమై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలలు పొడిగించాలని డీసీసీబీ డైరెక్టర్లు ఇటీవల వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి విన్నవించారు.

మరో 15 కొత్తవి ఏర్పాటు!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 56 పీఏసీఎస్‌లు ఉన్నాయి. 56 చైర్మన్లలో 16 మందిని డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు)కి డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు. మరో ఇద్దరు నామినేటెడ్‌ డైరెక్టర్లతో కలిపి మొత్తంగా 18మంది డైరెక్టర్లు ఉంటారు. వీరంతా డీసీసీబీ చైర్మన్‌తో పాటు, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. డీసీసీబీ ద్వారా మండల స్థాయిలో ఉన్న పీఏసీఎస్‌లకు రుణాలు అందజేస్తూ రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం డీసీసీబీ రూ.3 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలతో నడుస్తోంది. దాదాపు 1.25 లక్షల మందికి పైగా రైతులు సభ్యత్వం పొంది దీర్ఘకాలిక, స్వల్పకాలిక, బంగారు, వ్యక్తిగత రుణాలు పొందుతున్నారు. ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌లతో పాటు తాజాగా ఉమ్మడి జిల్లాలో మరో 15 కొత్తవి ఏర్పాటు చేసేందుకు సర్కార్‌ నిర్ణయించింది.

రాజకీయ రంగు

మండలాల స్థాయిలో జరిగే పీఏసీఎస్‌ డైరెక్టర్లు, చైర్మన్ల ఎన్నికల విషయంలోనూ రాజకీయ ప్రభావితం అధికంగా ఉంటుంది. పేరుకే రైతుల ఓట్లతో డైరెక్టర్లు గెలిచే అవకాాశం ఉన్నప్పటికీ గ్రామాల్లో మాత్రం తీవ్ర పోటీ ఉంటుంది. రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను నిలబెట్టి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తారు. రైతుల ఓట్లను కూడగట్టుకోవడం కోసం భారీగా ఖర్చు చేస్తారు. 2020లో జరిగిన ఎన్నికల సమయంలో అప్పటి సర్కార్‌లో ఎన్నికై న చైర్మన్లే అత్యధికంగా కొనసాగుతున్నారు. కొన్ని మండలాల్లో పదవి పోతుందనే భయంతో కొందరు చైర్మన్లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. రుణాల అందజేత విషయంలో తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలోని ఆశావహులు మాత్రం పీఏసీఎస్‌ల పదవీ కాలాన్ని పొడిగించకుండా తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు.

న్యూస్‌రీల్‌

మరో ఆరునెలలు పొడిగించాలంటున్న పాలకవర్గాలు

వెంటనే రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలంటున్న ఆశావహులు

కొనసాగుతున్న ఉత్కంఠ.. ప్రభుత్వం నుంచి ఇంకా రాని స్పష్టత

రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యం

పీఏసీఎస్‌లకు మరో ఆరు నెలల పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నాం. ఉమ్మడి జిల్లా డీసీసీబీ రూ.3 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలతో నడుస్తోంది. సర్కార్‌ అవకాశం ఇస్తే ఈ ఆరు నెలల్లో కొత్త పీఏసీఎస్‌లతో పాటు, డీసీసీబీ బ్యాంకులకు బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తాం. రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కృషి చేస్తాం.

– కొత్తకుర్మ సత్తయ్య, డీసీసీబీ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

తొలగింపా?1
1/2

తొలగింపా?

తొలగింపా?2
2/2

తొలగింపా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement