
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
మొయినాబాద్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. మొయినాబాద్ రైతు వేదికలో మంగళవారం జరిగిన రైతు నేస్తం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలకు పురుగు ముందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, మందులను వాడాలని తెలిపారు. వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు అందుబాటులో ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు బీమా పథకం కోసం 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న రైతులు అర్హులని.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల ప్రయోజనాలు పొందాలంటే రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించుకోవాలన్నారు. యూరియా, ఇతర ఎరువులు రైతులకు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏడీఏ సురేష్‌బాబు, మండల వ్యవసాయాధికిరి అనురాధ, ఏఈఓ సునీల్ పాల్గొన్నారు.