
అది పిల్లి కూనే!
కొత్తూరు: మండలంలోని పెంజర్ల గ్రామంలో ఓ ఎంఎన్‌సీ పరిశ్రమకు చెందిన స్థలంలో చిరుత కూనలు సంచరిస్తున్నాయని స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. గ్రామంలో కొనసాగుతున్న ఓ మల్టీ నేషనల్ పరిశ్రమకు చెందిన ఖాళీ స్థలంలో కార్మికులకు ఇటీవల చిరుతపులి పిల్ల ఆకారంలో ఉన్న ఓ కళేబరం కనిపించింది. ఈ విషయం వైరల్‌గా మారడంతో విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మృతి చెందిన కూన కళేబరాన్ని పరిశీలించారు. మృతి చెందిన కూన అటవీ ఎషియన్ లియోపర్డ్ జాతికి చెందిన పిల్లికూనగా గుర్తించారు. దీంతో కార్మికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.